మక్తల్: నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రూ.320 కోట్లతో చేపట్టే రహదారుల నిర్మాణ శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరవుతారని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గముఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శంకుస్థాపన అనంతరం అంబేడ్కర్‌నగర్ సమీపంలోని గురుకుల పాఠశాల ఆవరణలో బహిరంగసభ ఉంటుందని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఆనంద్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు రవికుమార్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి హన్మంతు, కట్టా సురేష్, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.


