రైతు భరోసా @ రూ.271 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా @ రూ.271 కోట్లు

Jul 8 2026 1:14 AM | Updated on Jul 8 2026 1:14 AM

2.02 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి

నారాయణపేట: రైతు భరోసా పథకం అమలులో నారాయణపేట జిల్లా కీలక మైలురాయిని చేరుకుంది. జిల్లాలోని 251 గ్రామాల పరిధిలో 2,02,136 మంది అర్హులైన రైతులకు రూ.271.57 కోట్ల రైతు భరోసా నిధులు మంజూరు చేశారు. ఇందులో 1,88,493 మంది రైతుల బ్యాంకు ఖాతాలను ఏఈ ఓలు నవీకరించగా వారికి సంబంధించిన రూ. 262.15 కోట్ల రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమమైంది. కాగా ఇప్పటి వరకు 1,82,199 మంది రైతులకు సంబంధించిన రూ.259.09 కోట్ల బిల్లులు ట్రెజరీకి చేరాయి. మిగిలిన వారికి సంబంధించిన ఈ కేవైసీ, బ్యాంక్‌ ఖాతాలో తప్పులు తదితర కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. రైతులు ఏఈఓలను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

మక్తల్‌ మండలానికి అత్యధికంగా రూ.39.44 కోట్లు

1.88 లక్షల ఖాతాల నవీకరణ

152 డీబీటీ చెల్లింపులు పెండింగ్‌

విడతల వారీగా చెల్లింపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement