రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన జిల్లా అథ్లెట్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన జిల్లా అథ్లెట్లు

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం జరిగిన 4వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి రమణ ఆదివారం తెలిపారు. మహిళా విభాగంలో ఐదువేల మీటర్ల పరుగుపందెంలో నిర్మల, అండర్‌–16 మహిళా విభాగం రెండు వేల మీటర్ల పరుగు పందెంలో పూజ రజత పతకం సాధించారన్నారు. అదేవిధంగా పురుషుల ఐదువేల మీటర్ల పరుగు పందెంలో వంశరాజ్‌ కిరణ్‌కుమార్‌, ట్రాయథ్లాన్‌ సి–గ్రూప్‌లో వేణుకుమార్‌ కాంస్య పతకం సాధించినట్లు చెప్పారు. పతకాలను తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సారంగపాణి క్రీడాకారులకు అందజేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement