భూ నష్ట పరిహారం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

భూ నష్ట పరిహారం పెంచాలి

Jul 5 2026 8:02 AM | Updated on Jul 5 2026 8:02 AM

కోస్గి రూరల్‌: నారాయణపేట రేడియల్‌ రోడ్‌, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు నష్ట పరిహారం పెంచి ఇవ్వాలని ఆర్డీఓ రమేష్‌ను పలువురు రైతులు కోరారు. శనివారం మండలంలోని తోగాపూర్‌ ఆంజనేయస్వామి ఆలయం, నాచారం గ్రామపంచాయతీ కార్యాలయంలో భూ సేకరణ నాలుగో గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. తోగాపూర్‌లో 70 మంది రైతులకు చెందిన 26 ఎకరాలు, నాచారం గ్రామంలో 150 మంది రైతులకు చెందిన 67 ఎకరాల భూమి కోల్పోతున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఉన్న కాస్త భూమిని కోల్పోతున్నామని, భూమికి బదులు భూమి ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. స్పందించిన ఆయన అలా ఇవ్వడం కుదరదని తేల్చి తెలిపారు. రైతులు ఇచ్చిన అనుమతి పత్రాల మేరకు నష్టపరిహారం పెంపు విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, బాధితులకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, డీటీ బాలరాజు, ఆర్‌ఐ సుభాష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ భీమమ్మ, సర్పంచ్‌లు రేణుకు, శ్రీనివాస్‌, జీపీఓలు సత్యనారాయణ, అంజప్ప పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement