వైభవంగా దత్తాత్రేయస్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా దత్తాత్రేయస్వామి రథోత్సవం

Feb 16 2026 8:43 AM | Updated on Feb 16 2026 8:43 AM

వైభవంగా దత్తాత్రేయస్వామి రథోత్సవం

వైభవంగా దత్తాత్రేయస్వామి రథోత్సవం

మండలంలోని పస్పులలో కృష్టానది ఒడ్డున వెలిసిన శ్రీవల్లభాపురం దత్తాత్రేయస్వామి

రథోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం నుంచి పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి రంగురంగుల పూలు, విద్యుద్ధీపాలతో

అలంకరించిన రథంపై కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని వేలాది మంది భక్తుల కోలాహలం నడుమ ముందుకు లాగారు. ఈ సందర్భంగా రథోత్సవానికి

వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ దత్తప్ప, కార్యదర్శి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. – మక్తల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement