పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం

Apr 2 2026 7:23 AM | Updated on Apr 2 2026 7:23 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌లో పదో తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. బుధవారం హిందీ జవాబు పత్రాలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ చేపట్టారు. మొత్తం 1,100 మంది సిబ్బంది ఇందులో పాల్గొనున్నారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్‌, పరీక్షల అడిషనల్‌ కమిషనర్‌ కమలాకర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే వారు సెల్‌ఫోన్‌లు ఉపయోగించవద్దని, వ్యాలువేషన్‌ కోసం డ్యూటీలు కేటాయించిన వారు తప్పకుండా విధులకు హాజరుకావాలని సూచించారు. అయితే పలు పాఠశాలలో సిబ్బందికి అనారోగ్యం, చిన్నపిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం విధులు కేటాయించడంతో.. వారికి విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పలు సంఘాల నాయకులు డీఈఓను కోరారు. అలాంటి వారికి మినహాయింపు ఇచ్చి, కొత్త వారికి విధులను కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement