నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పా టు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.
– మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్


