కనెక్టివిటీల ప్రకారం అలైన్‌మెంట్ మార్చి కొత్త రైలు మార్గం రూపొందించారు. ఈ రైలు మార్గంలో తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కొత్త రైల్వేలైన్ కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, భీమవరం, నల్లగొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి వంటి ముఖ్యమైన పట్టణాలను అనుసంధానించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ఈ ముఖ్యమైన ప్రాజెక్టులలో డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ ఒకటి. ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లభించింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉమ్మడి పాలమూరు ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. నాలుగు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
ఇప్పటి వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ లేని వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట జిల్లాలకు రైల్వే సౌకర్యం కలిగి.. వెనకబడిన ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఈ రైల్వేలైన్ ఏర్పాటుతో కాజీపేట– విజయవాడ, సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– కర్నూలు వంటి మూడు ప్రధాన రైల్వేలైన్ మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పటికే గద్వాల– రాయచూర్, డోర్నకల్– మణుగూరు (మహబూబాబాద్) మధ్య రైల్వే లైన్స్ ఉన్నాయి. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణలోని తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా రైలు మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గద్వాల, డోర్నకల్ రైల్వేస్టేషన్లు జంక్షన్లు కాగా కొత్తగా నల్లగొండ రైల్వేస్టేషన్ జంక్షన్ ఏర్పడుతుంది. రైల్వేలైన్, మామిడి క్లస్టర్, జాతీయ రహదారులతో నాగర్‌కర్నూల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందనుంది.
జడ్చర్ల– నంద్యాల సర్వే పూర్తి
జడ్చర్ల– నంద్యాల కొత్త రైల్వేలైన్ మార్గం సర్వే కూడా పూర్తయింది. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా నంద్యాల వరకు 182 కి.మీ., మార్గం అత్యంత కీలకమైంది. అప్పటి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు దీని కోసం పట్టుబట్టి సర్వేల వరకు తీసుకొచ్చారు. రూ.340 కోట్ల అంచనాతో 2007లో ప్రతిపాదనలు తయారు చేశారు. డోర్నకల్– గద్వాల రైల్వే మార్గంతో పాటు దీని సర్వే చేసినా.. ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయని దక్షిణమఽ ద్య రైల్వే శా ఖ భావిస్తోంది. దీంతో ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలకు దగ్గర అవుతుంది.
1981లో బీజం.. మార్పులతో ఆమోదం
గద్వాల
గతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్‌ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్‌లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్‌ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్‌లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్‌ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్‌కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్‌మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.
పరిశ్రమలు, ఉపాధి మెరుగు..
దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త రైల్వేలైన్ అనుసంధానం కానుంది. ఈ లైన్ రాష్ట్రంలోని ఆయా జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, ఢిల్లీకి అనుసంధానించబడుతుంది. అలాగే మొదటిసారి రైలు సౌకర్యం పొందడం వల్ల ఈ ప్రాంత సామాజిక– ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వ్యవసాయం, వ్యా పారం, విద్య, పర్యాటకం, వైద్యం వంటి వివిధ రంగాల కోసం రాష్ట్ర రాజధానికి ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ లైన్ సిమెంట్, గ్రానైట్ పారిశ్రామిక జోన్ల గుండా వెళ్తుండటం వల్ల ఆ ఉత్పత్తులను దే శంలోని ఇతర ప్రాంతాలకు రవా ణా చేయడానికి ఊ తం లభిస్తుంది. అలాగే సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేయడానికి ఇది తక్కువ దూరపు మార్గంగా ఉపయోగపడుతుంది.


