కొత్తపల్లి: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన బావోజీ జాతర సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసులు వేడుకలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ రియాజుల్‌హక్ సూచించారు. బావాజీ జాతరకు అదనపు ఎస్పీతో పాటు, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు మొత్తంగా 150 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జాతరలో దొంగతనాలు, ఈవ్ టీజింగ్ జరగకుండా మఫ్టీలో పోలీసులు నిరంతరం గస్తీ చేయాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్‌ఐ విజయ్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


