టెన్నిస్‌లో అడిషనల్‌ ఎస్పీకి స్వర్ణం | - | Sakshi
Sakshi News home page

టెన్నిస్‌లో అడిషనల్‌ ఎస్పీకి స్వర్ణం

Feb 22 2026 7:07 AM | Updated on Feb 22 2026 7:07 AM

టెన్న

టెన్నిస్‌లో అడిషనల్‌ ఎస్పీకి స్వర్ణం

నారాయణపేట: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వేదికగా కొనసాగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ హుల్‌హక్‌ చక్కటి ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నారు. 50 ఏళ్ల పైబడిన సీనియర్‌ అధికారుల లాన్‌ టెన్నిస్‌ విభాగంలో అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానంలో నిలిచారు. సైబరాబాద్‌ సీపీ మస్తీపురం రమేష్‌ బంగారు పతకం అందజేసి అభినందనలు తెలిపారు. జోగుళాంబ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ జిల్లాకు స్వర్ణ పతకం సాధించిన అదనపు ఎస్పీని ఎస్పీ వినీత్‌ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో పోలీస్‌ అధికారులు రాణించడం జిల్లా పోలీస్‌ విభాగానికి గర్వకారణమని పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయిలో సత్తా

చాటిన జిల్లా క్రీడాకారులు

నారాయణపేట: సీఎం కప్‌ రాష్ట్రస్థాయి రోయింగ్‌ పోటీలో జిల్లాకు చెందిన విద్యాశ్రీ బంగారు పతకం, అండర్‌–16 షాట్‌పుట్‌లో నర్మద కాంస్య పతకం సాధించినట్లు జిల్లా యువజన సర్వీసులశాఖ అధికారి వెంకటేశ్‌ శెట్టి తెలిపారు. జిల్లా క్రీడాకారులు బంగారు, కాంస్య పతకాలు సాధించడంతో పీడీ, కోచ్‌లను ఆయన అభినందించారు.

కోయిల్‌సాగర్‌ నీటి వృథా

మరికల్‌: మండలంలోని పెద్ద చెరువుకు వచ్చే కోయిల్‌సాగర్‌ నీటికి అడ్డుకట్ట వేయడంతో వృథా అవుతున్నాయి. చెరువులో చేపలు పట్టేందుకుగాను నెలరోజుల నుంచి పెద్ద చెరువు నీటిని బయటకు వదిలారు. కోయిల్‌సాగర్‌ నుంచి వస్తున్న నీరు కూడా చెరువులోకి చేరకుండా మళ్లించడంపై గ్రామస్తులు, ప్రతిపక్షల పార్టీల నాయకులు మత్స్యకారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద చెరువులో నీరు లేక సోర్సు బోర్లలో నీటిమట్టం తగ్గుముఖం పట్టిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.

టెన్నిస్‌లో అడిషనల్‌ ఎస్పీకి స్వర్ణం 
1
1/2

టెన్నిస్‌లో అడిషనల్‌ ఎస్పీకి స్వర్ణం

టెన్నిస్‌లో అడిషనల్‌ ఎస్పీకి స్వర్ణం 
2
2/2

టెన్నిస్‌లో అడిషనల్‌ ఎస్పీకి స్వర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement