ఫైనల్‌లో పోరాడి ఓడిన మహిళా జట్టు | - | Sakshi
Sakshi News home page

ఫైనల్‌లో పోరాడి ఓడిన మహిళా జట్టు

Feb 8 2026 7:40 AM | Updated on Feb 8 2026 7:40 AM

ఫైనల్‌లో పోరాడి ఓడిన మహిళా జట్టు

ఫైనల్‌లో పోరాడి ఓడిన మహిళా జట్టు

రన్నరప్‌గా నిలిచిన పాలమూరు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: వరంగల్‌లో జరుగుతున్న సీనియర్‌ మహిళాజట్టు ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టీ–20 టోర్నమెంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జట్టు ఫైనల్‌లో చివరి ఓవర్‌ వరకు పోరాడి రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో వరంగల్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వరంగల్‌ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పో యి 98 పరుగులు చేసింది. జట్టులో సాయి ధ్రువిజ్ఞ 38 పరుగులు చేసింది. మహబూబ్‌నగర్‌ బౌలర్లు త్రివేణి 3, అక్షర రాథోడ్‌, ఇందు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మ హబూబ్‌నగర్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 94 పరుగుల వద్దే నిలిచిపోయింది. జట్టులో ఆర్యాని (30), ఇందు (18) మాత్రమే రాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement