ఈవీఎం గోదాంపై నిరంతర నిఘా
నారాయణపేట: ఈవీఎం గోదాం భద్రతపై నిరంతరం నిఘా ఉంచాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. నెలవారీ తనిఖీలో భాగంగా శనివారం ఆయన జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను ఆయన తనిఖీ చేశారు. వీవీ ప్యాట్స్, ఈవీఎంల భద్రత, ఎంతమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని, గోదాం చుట్టూ ప్రహరీ, సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారిణి జయసుధ, రాణిదేవి ఉన్నారు.


