‘పది’ విద్యార్థులకుప్రణాళిక
నర్వ: పదోతరగతి విద్యార్థుల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఇన్‌చార్జి తహసీల్దార్, శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ కోరారు. శనివారం స్థానిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 విద్యాశాఖ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ సమకూర్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై హెచ్‌ఎంలతో సమీక్షించారు. సమావేశంలో ఎంపీడీఓ రమేష్‌కుమార్, ఎంఈఓ రాంరెడ్డి, క్లస్టర్ హెచ్‌ఎం సునీత తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.5,441
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.10,259, కనిష్టంగా రూ.5,219 ధర పలికింది. అదేవిధంగా శనగలు రూ.5,441, ఆలసందలు గరిష్టంగా రూ.6,266, కనిష్టంగా రూ.6,012, ఎర్ర కంది రూ.8,512– రూ.5,591, తెల్ల కంది గరిష్టంగా రూ.8,512, కనిష్టంగా రూ.6,032 ధరలు లభించాయి.
బీజేపీకి ఓటేసేందుకు
సిద్ధంగా ఉన్న ప్రజలు
పాలమూరు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బూత్‌స్థాయిలో బాధ్యతగా పని చేయాలని, మరో 4 రోజులు కష్టపడితే ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశ దొరుకుతుందని జాతీయ మహిళ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ రేఖశర్మ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీకి ప్రజలు ఓటువేయడానికి సిద్ధంగా ఉన్నారని, కొద్దిగా కష్టపడితే ఈ ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని తెలిపా రు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ 4 రోజులు కొంత శ్రద్ధ పెంచాలన్నారు. ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్‌చార్జి చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, బాలరాజు, పవన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
‘పది’ విద్యార్థులకుప్రణాళిక


