మక్తల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా | - | Sakshi
Sakshi News home page

మక్తల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా

Feb 7 2026 9:40 AM | Updated on Feb 7 2026 2:54 PM

మక్తల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా

మక్తల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా

మక్తల్‌: స్థానిక పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పుర ఎన్నికల్లో భాగంగా వివిధ కాలనీల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేశవనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పట్టణంలో రూ.43 కోట్లతో 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులు చేపడుతున్నామని చెప్పారు. పార్టీ అభ్యర్థులను అధికసంఖ్యలో గెలిపించి పురపాలికపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేష్‌, మార్కెట్‌ డైరెక్టర్లు ఫయాజ్‌, శ్రీనివాసులు, రంజిత్‌కుమార్‌రెడ్డి, గోవర్ధన్‌, రవికుమార్‌, రాజేందర్‌, రహీం పటేల్‌, శంషోద్దీన్‌, ఎండీ సలాం, కట్టా సురేష్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement