‘ఉద్యమ్‌ నమోదు’పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

‘ఉద్యమ్‌ నమోదు’పై అవగాహన

Feb 27 2026 8:17 AM | Updated on Feb 27 2026 8:17 AM

‘ఉద్య

‘ఉద్యమ్‌ నమోదు’పై అవగాహన

నారాయణపేట: జిల్లా పరిశ్రమల కేంద్రం ఈడీసీ బృందం ఆధ్వర్యంలో ఉద్యమ్‌ నమోదుపై జిల్లాకేంద్రంలో గురువారం పారిశ్రామితవేత్తలు, యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పరిశ్రమలశాఖ ఐపీఓ నర్సింగ్‌రావు హాజరై మాట్లాడారు. ఉద్యమ్‌ నమోదు అనేది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అత్యంత అవసరమైన ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియని.. చేకూరే ముఖ్య ప్రయోజనాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్య రుణాల కింద ఆర్థిక సాయం, చెల్లింపుల ఆలస్యంపై రక్షణ, ప్రభుత్వ టెండర్లలో పాల్గొనే అవకాశం, వివిధ ఎంఎస్‌ఎంఈ పథకాల ప్రయోజనాలు, ఉద్యమ్‌ నమోదు విధానం, అవసరమైన పత్రాలు, నమోదు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం భవిష్యత్‌లో పారిశ్రామిక వేత్తలకు అవసరమైన మార్గదర్శకాలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌, ఈడీసీ మేనేజర్‌ పి.నవీన్‌కుమార్‌రెడ్డి, అసిస్టెంట్‌ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, పీఎంఎఫ్‌ఎంఈ డీఆర్పీ యశ్వంత్‌, హ్యాండ్లూమ్స్‌శాఖ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పాల్గొన్నారు.

‘ఉద్యమ్‌ నమోదు’పై అవగాహన 1
1/1

‘ఉద్యమ్‌ నమోదు’పై అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement