77.96% | - | Sakshi
Sakshi News home page

77.96%

Feb 13 2026 5:48 AM | Updated on Feb 13 2026 5:48 AM

77.96

77.96%

2020లో
‘పుర’ ఎన్నికల్లో 0.52 శాతం తగ్గిన పోలింగ్‌

78.48%

2026లో

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: గత పురపాలక ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి పాలమూరులో ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట.. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర, మద్దూర్‌ మినహాయించి మిగిలిన 17 మున్సిపాలిటీల్లో 2020లో మొత్తంగా 78.48 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అవే పురపాలికల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో 77.96 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఈ లెక్కన పోలింగ్‌ 0.52 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది.

ఎక్కడెక్కడ.. ఎలా అంటే..

మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన మహబూబ్‌నగర్‌లో గత ఎన్నికల్లో 67.17 శాతం మంది ఓటేశారు. ఈ ఎన్నికల్లో 67.73 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. స్వల్పంగా 0.56 శాతం పెరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో 0.75, పెబ్బేరులో 0.60, అమరచింతలో 2.89, జోగులాంబ జిల్లాలోని గద్వాలలో 0.47, అలంపూర్‌లో 1.15, వడ్డేపల్లిలో 0.02 శాతం పోలింగ్‌ పెరిగినట్లు స్పష్టమవుతోంది.

గత ఎన్నికలతో పోలిస్తే నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ మున్సిపాలిటీలో ఈ సారి అత్యధికంగా 4.04 శాతం పోలింగ్‌ తగ్గింది. అదేవిధంగా నారాయణపేటలో 0.75, కోస్గిలో 0.24, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లో 2.91, కల్వకుర్తిలో 0.04, కొల్లాపూర్‌లో 1.32, జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో 2.37, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌లో 1.54, వనపర్తి జిల్లాలోని వనపర్తిలో 1.45, ఆత్మకూరులో 0.53 శాతం మేర పడిపోయింది.

10 మున్సిపాలిటీల్లో తగ్గుదల.. మరో ఏడింటిలో పెరుగుదల

అత్యధికంగా మక్తల్‌లో 4.04 శాతం మేర పడిపోయిన ఓటింగ్‌

అమరచింతలో 2.89 శాతం మేర పైకి..

77.96%1
1/1

77.96%

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement