నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశాల కోసం శనివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్‌రావు అన్నారు. గురువారం నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షల కోసం కేంద్రాల సూపరింటెండెంట్లు, కేంద్రస్థాయి పరిశీలకులకు నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పి.భాస్కర్‌కుమార్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రావు మాట్లాడుతూ 9వ తరగతిలో 6, 11వ తరగతిలో 13 ఖాళీలకు గాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,592 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నిర్వహించే పరీక్షకు మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.


