కేజీబీవీని సందర్శించిన జీసీడీఓ
ఊట్కూర్: మండలంలోని పులిమామిడిలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని గురువారం జీసీడీఓ సంగీత సందర్శించారు. పాఠశాల, జూనియర్ కళాశాల రికార్డులను తనిఖీ చేసి తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాలని ఎస్‌ఓ లక్ష్మిని ఆదేశించారు. ఆమె వెంట సీఎంఓ రాజేంద్రకుమార్, యాదయ్యశెట్టి తదితరులు ఉన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడు దివ్యాంగుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తోందని.. వారికి సంక్షేమ ఫలా లు సకాలంలో అందిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. వికలాంగుల జాతీయ హక్కుల వేదిక (ఎన్‌పీఆర్డీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను కలెక్టరేట్‌లో గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ఎన్‌పీఆర్డీ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక జిల్లా ప్రధానకార్యదర్శి కాశప్ప, జిల్లా సహాయ కార్యదర్శులు బాలరాజు, బస్వరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఖతల్, పెంటయ్య, నరేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాల రద్దు సరికాదు : సీఐటీయూ
నారాయణపేట ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు అమలులోకి తెస్తూ 2025, నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యుత్ సవరణ చట్టం 2025ను ఉపసంహరించుకోవాలని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకాన్ని కొనసాగించాలని, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన బిల్లులు పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికుల హక్కులు హరించే విధంగా చట్టాలను రూపొందిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా చేపట్టే అఖిల భారత సార్వత్రిక సమ్మెలో కార్మికుల అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, జిల్లా కార్యదర్శి బండమీది బాలరాం, ఉపాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, జిల్లా నాయకుడు నరహరి తదితరులు పాల్గొన్నారు.
పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కళాళాలలకు సంబంధించి డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం పీయూ వీసీ జి.ఎన్.శ్రీనివాస్ వెల్లడించారు. ఇందులో భాగంగా సెమిస్టర్–1లో 30.08 శాతం, 3లో 39.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆయన పేర్కొన్నారు. పీయూ పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.రమేష్‌బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డా.కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కో–ఆర్డినేటర్ డా.అరుంధతిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గౌతం పాల్గొన్నారు.
కేజీబీవీని సందర్శించిన జీసీడీఓ
కేజీబీవీని సందర్శించిన జీసీడీఓ


