ఎమ్మెల్యే ఇంటిపై దాడి హేయమైన చర్య
నారాయణపేట: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని.. పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ ఉగ్రరూపం చవిచూడాల్సి వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అన్నారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నోటికి నల్లగుడ్డ కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడతానని సవాల్ చేస్తే.. ఆ పార్టీ నాయకులు ముందుకురాకుండా ఆయన ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక ఎమ్మెల్యేకు భద్రత లేదని.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కొండా శ్వేత, వైస్‌చైర్‌పర్సన్ మంజుల, కౌన్సిలర్లు అపిరెడ్డిపల్లి రాము, రాఘవేంద్ర, ప్రభాకర్, లక్ష్మప్ప, సౌజన్య, మాణిక్యమ్మ, నాయకులు సత్యయాదవ్, జీఆర్ రెడ్డి, వెంకట్రాములు, మిర్చి వెంకటయ్య, బాల్‌రెడ్డి, జి.రాఘవేందర్‌రెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణ, వడ్డె దత్తు, సాయిబన్న, శ్రీను, చలపతి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఇంటిపై దాడి హేయమైన చర్య


