ఆదాయానికి గండి!
●
జిల్లాకేంద్రంలో నిరుపయోగంగా వాణిజ్య దుకాణ సముదాయం
ఉలుకూ పలుకూ లేదు..
గత ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచి దుకాణాలు కేటాయించలేకపోయారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఉలుకూ.. పలుకూ లేదు. దుకాణాలు కేటాయిస్తే చిరువ్యాపారులకు ఎంతో లాభాదాయకం. జీవనోపాధి పొందుతారు. వెంటనే అధికార యంత్రంగం స్పందించి దుకాణాల కేటాయింపు పూర్తిచేయాలి.
– శివవీర్‌రెడ్డి, బీకేఎస్ రాష్ట్ర నేత,
నారాయణపేట
త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం..
వాణిజ్య సముదాయం టెండర్లు పిలవాలా? లేక రైతుబజార్‌లో ఇచ్చిన 16 దుకాణాల మాదిరిగా ఇవ్వడమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళ్లి చిరువ్యాపారులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. వెంటనే దుకాణాలు తెరిచేందుకు కృషిచేస్తాం.
– ఆర్.శివారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, నారాయణపేట
నిబంధనల మేరకే..
మార్కెటింగ్ నిబంధనల ప్రకారమే దుకాణాల టెండర్ల ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మార్కెట్ పాలకవర్గం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే రిజర్వేషన్ల ప్రతిపాదికన దుకాణాల కేటాయింపు పూర్తిచేస్తాం. – బాలమణి, ఇన్‌చార్జి డీఎంఓ
నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట చేనేత, బంగారం వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధిగాంచింది. వ్యాపార రంగం మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో జిల్లాకేంద్రం నడిబొడ్డున ఆర్టీసీ పాతబస్టాండ్ వద్ద మార్కెట్‌యార్డును అనుసరించి రూ. 1.56 కోట్లతో 28 వాణిజ్య దుకాణాల సముదాయం, రైతుబజార్ కాంప్లెక్స్‌లో రూ.38 లక్షలతో 16 దుకాణాలు నిర్మించారు. వీటిని 2018 ఫిబ్రవరి 17న అప్పటి రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నాటి నుంచి వాణిజ్య సముదాయంలోని 28 దుకాణాలు వినియోగానికి నోచుకోక దిష్టిబొమ్మల్లా మారాయి. దుకాణాల కేటాయింపుపై కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించకపోవడంతోనే నిరుపయోగంగా మారాయని పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య దుకాణాలకు రాజకీయ గ్రహణం పట్టిందని వాపోతున్నారు.
8ఏళ్ల క్రితం రూ. 1.56 కోట్లతో 28 దుకాణాల నిర్మాణం
రిజర్వేషన్ల ఖరారుప్రతిపాదనలకే పరిమితం
మార్కెట్‌యార్డుకు రూ. 1.50కోట్లకు పైగా నష్టం
చిరువ్యాపారుల కోసం..
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ డిపోకు చెందిన స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించారు. అప్పటికే అక్కడ అద్దెకు వేసుకున్న షెడ్ల తొలగింపుతో చిరువ్యాపారులు ఉపాధి కోల్పోతారనే ఉద్దేశంతో 2023లో అప్పటి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రైతుబజార్‌లోని 16 దుకాణాలను పలువురికి కేటాయించారు. దుకాణాలు దక్కిన వారంతా అప్పట్లో ఎస్‌ఆర్ రెడ్డి కృషిని కొనియాడారు.
ఆదాయానికి గండి!


