పకడ్బందీగా పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పోలింగ్‌

Feb 10 2026 7:24 AM | Updated on Feb 10 2026 7:24 AM

పకడ్బందీగా పోలింగ్‌

పకడ్బందీగా పోలింగ్‌

నారాయణపేట: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రి య పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందు కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి, అదనపు కలెక్టర్‌ శ్రీనుతో కలిసి మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, కమిషనర్లు, ఎన్నికల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మంగళవారం మున్సిపల్‌ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్‌/రిసెప్షన్‌ సెంటర్లలో పోలింగ్‌ సామగ్రి పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌, మైక్రో అబ్జర్వర్ల శిక్షణ పూర్తయిందన్నారు. 99 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేశామన్నారు. పోలింగ్‌ సామగ్రిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని.. మధ్యా హ్న భోజనం ముగించుకుని ఎవరికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు వారు వెళ్లిపోవాలని కలెక్టర్‌ సూచించారు. అదే విధంగా పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బందికి అన్ని వసతి సౌకర్యాలు కల్పి ంచాలని కమిషనర్లను ఆదేశించారు. పోలింగ్‌ ఆఫీసర్స్‌ గుర్తింపు కార్డులు, పోలింగ్‌ ఏజెంట్ల పాసులు, వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలన్నారు. ఈ నెల 11న ఎన్నికల నియమ నిబంధనల మేరకు పోలింగ్‌ నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్‌ బాక్సులను రిసెప్షన్‌ సెంటర్లకు తరలించి.. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరచాలన్నారు. 13న కౌంటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. అధికారులంతా బాధ్యతగా పనిచేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేయాలన్నారు.

16న చైర్మన్‌ ఎన్నిక..

ఎన్నికై న కౌన్సిలర్లు, ఎక్స్‌ఆఫీషియో సభ్యులకు నోటీసులు జారీచేసి 16న చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలన్నారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా కోరం లేకపోతే.. ఒక గంట సమయం ఇవ్వాలన్నారు. అప్పటికీ కోరం లేకపోతే మరుసటి రోజు చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందన్నారు. చైర్మన్‌ ఎన్నిక సమయంలో కౌన్సిలర్లు చేతులు ఎత్తే ప్రక్రియను పూర్తిగా వీడియో, ఫొటో చిత్రీకరణ చేయించాలన్నారు. చైర్‌పర్సన్‌ ఎన్నికై న తర్వాత వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కూడా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో ప్రత్యేకాధికారులు రాజేందర్‌గౌడ్‌, రామచందర్‌ నాయక్‌, మొగులప్ప, జాన్‌ సుధాకర్‌, సుధాకర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement