క్రీడాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

క్రీడాభివృద్ధికి కృషి

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

క్రీడ

క్రీడాభివృద్ధికి కృషి

ధన్వాడ: క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని డీవైఎస్‌ఓ వెంకటేశ్‌ శెట్టి అన్నారు. మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చేపట్టిన రెజ్లింగ్‌ కోర్టు నిర్మాణ పనులను బుధవారం డీఈ యశ్వంత్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. రెజ్లింగ్‌ కోర్టు పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని గుత్తేదారుకు సూచించారు. వారి వెంట పీడీ సాయినాథ్‌, రవికుమార్‌ ఉన్నారు.

టీజీ–ఐపాస్‌తో పరిశ్రమల స్థాపనకు అనుమతులు

నారాయణపేట: టీజీ–ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపనకు నిబంధనల ప్రకారం అనుమతులు జారీ చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీను అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీ–ఐపాస్‌ కింద పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం వివిధ శాఖల వద్ద ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. సకాలంలో ఆమోదించాలన్నారు. టీ–ప్రైడ్‌ కింద ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు 50 పరిశ్రమలకు దరఖాస్తు చేసుకోగా.. 36 యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేశామని తెలిపారు. అనంతరం జిల్లా డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్‌ సమావేశమై మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు డిజిల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలోని ఐటీఐ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలను డీఈఈటీలో నమోదయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ రామలింగేశ్వర్‌గౌడ్‌, ఐపీఓ పి.నర్సింహారావు, తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, డీపీఓ సుధాకర్‌రెడ్డి, ఆర్టీఓ మేఘాగాంధీ, ఉద్యానశాఖ అధికారి సాయిబాబా, డీఏఓ జాన్‌ సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

పెసర క్వింటా రూ.7,221

నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్‌యార్డులో బుధవారం పెసర క్వింటాకు రూ. 7,221 ధర పలికింది. వేరుశన గ గరిష్టంగా రూ. 8,406, కనిష్టంగా రూ. 4, 050,ఉలవలు రూ. 3,529, అలసందలు రూ. 6,192, వడ్లు (సోన) రూ. 2,460, ఎర్రకందులు గరిష్టంగా రూ. 8,469, కనిష్టంగా రూ. 6,255, తెల్లకందులు గరిష్టంగా రూ. 8,669, కనిష్టంగా రూ. 7,980 ధరలు పలికాయి.

క్రీడాభివృద్ధికి కృషి 
1
1/1

క్రీడాభివృద్ధికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement