ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 16వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీ క్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 4,409 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,783 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. మొత్తం 15 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. 15 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, 15 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఒక సిట్టింగ్ స్క్వాడ్, ఇద్దరు కస్టోడియన్ అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పరీ క్షలు జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, లైటింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలని.. పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకో వాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడిపి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో డీఈసీ కన్వీనర్ సుదర్శన్‌రావు, సభ్యులు శ్రీనివాసులు నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.


