ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 21 2026 8:01 AM | Updated on Feb 21 2026 8:01 AM

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లనుతీసుకెళ్లేందుకు అనుమతి లేదు

ఇంటర్‌ బోర్టు డిప్యూటీ సెక్రటరీ విశ్వేశ్వర్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ బోర్టు డిప్యూటీ సెక్రటరీ విశ్వేశ్వర్‌ సూచించారు. జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్‌ కళాశాలలో సీఎస్‌లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రంలోనికి వెళ్లే ఏ అధికారి అయినా గేటు వద్దే ఫోన్‌లు డిపాజిట్‌ చేసి వెళ్లాలని, లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. అన్ని పరీక్షకేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటిని బోర్డులో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానంగా ఉంటాయన్నారు. ప్రశ్నపత్రాలను కేవలం సీసీ కెమెరాల ముందు మాత్రమే ఓపెన్‌ చేయాలని సూచించారు. కేంద్రాల్లో కాపీయింగ్‌ జరిగేందుకు అవకాశం ఇవ్వకూడదని, కాపీయింగ్‌కు పాల్పడితే సంబంధిత డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లు బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ కౌసర్‌జహాన్‌, డీఈఓ ప్రవీణ్‌కుమార్‌, డీఈసీ మెంబర్లు ఉమామహేశ్వర్‌, నుజత్‌నదీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement