కవుల పోషణ
స్వాతంత్య్రానికి ముందే కొల్లాపూర్‌లో డబుల్ లైన్ రోడ్లు, అండర్ గ్రౌండ్
డ్రెయినేజీ, ఆస్పత్రి ఏర్పాటు
ఆధ్యాత్మికతతోపాటు తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట
కళలకు
పట్టం..
ఉద్యానవనాల
సాగుకు బీజం
తెలంగాణ రాష్ట్రంలో గల 14 సంస్థానాల్లో సురభిరాజులది ఒకటి. జటప్రోల్‌ను కేంద్రంగా చేసుకుని సాగించిన వీరి పరిపాలనకు సంబంధించిన చారిత్రక అంశాలు 14వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉన్నాయి. జటప్రోల్‌లో శత్రుదుర్భేద్యమైన రాజధాని కోట నిర్మించారు. జటప్రోల్ సంస్థానంపైకి తరచూ కర్నూలు జిల్లా నుంచి శత్రురాజులు దండయాత్రలు చేస్తుండడంతో 1840లో రాజా లక్ష్మణరాయల కాలంలో సంస్థానాన్ని కొల్లాపూర్‌కు మార్చారు. మైసూరు ప్యాలెస్ నమూనాతో రాజమహల్, మంత్రమహల్, రాణిమహల్ అని విభజించి భారీ కోటను నిర్మించారు. 1884లో రాజా వెంకటలక్ష్మణరావు హయాంలో సంస్థానం కోట నిర్మాణం జరిగింది. 1948లో సురభిరాజుల సంస్థానం రాజా వెంకట జగన్నాథరావు పరిపాలనా కాలంలో భారత ప్రభుత్వంలో విలీనమైంది.
సురభి రాజులు శిల్ప, చిత్రకళలకు ప్రాధాన్యం ఇచ్చారు. 16వ శతాబ్దంలో జటప్రోల్, మంచాలకట్ట, సోమశిల గ్రామాల్లో నిర్మించిన పురాతన ఆలయాలే ఇందుకు నిదర్శనం. శ్రీశైలం డ్యాం నిర్మాణంలో ఈ గుడులన్నీ కృష్ణానదిలో మునిగిపోగా.. 1989లో జటప్రోల్, కొల్లాపూర్‌లో మదనగోపాలస్వామి, మూకగుడులు, సోమశిలలో లలితాంబికా సోమేశ్వరాలయాలను పురావస్తు శాఖ పునర్నిర్మించింది. జటప్రోల్‌లో ఆలయ ముఖద్వారం, ఆలయంలో మంటపాలు, మదనగోపాలస్వామి ఆలయంలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు సురభిరాజుల శిల్పకళా సౌరభాన్ని చాటుతాయి. అలాగే చిత్రకళలకు కూడా వీరు ప్రాధా న్యం ఇచ్చారు. సురభిరాజుల కోటలో ఉన్న చిత్రాలు ఈ విషయాన్ని తెలియపరుస్తాయి.
సురభిరాజులు కవులను కూడా పోషించారు. 19వ తరం పాలకుడైన మాధవరావు స్వతహాగా చంద్రికాపరిణయం అనే కవితా సంపుటిని రచించారు. సురభి సంస్థానంలో ఎలకూచి బాలసరస్వతి, ఎల్లూరి నరసింగకవి, వాజపేయాజుల రామసుబ్బరాట్ కవి వంటి ఉద్దండులు ఉండేవారు.
దక్షిణ భారతంలో
రెండో విమానం కొనుగోలు
చేసింది వీరే..
సుపరిపాలన
అందించిన
రాజా
వెంకట లక్ష్మారావు
హైదరాబాద్‌లో రాజవంశ వారసులు..
సురభి రాజవంశ వారసుడిగా ప్రస్తుతం ఆదిత్య లక్ష్మారావు కొనసాగుతున్నారు. సింగోటం లక్ష్మీనర్సింహస్వామి, జటప్రోల్ మదనగోపాలస్వామి, కొల్లాపూర్‌లోని మాధవస్వామి, బండాయిగుట్ట వేంకటేశ్వరస్వామి, శివాలయం, రామాలయాలకు ఫౌండర్ ట్రస్టీగా ఉన్నారు. ఆదిత్య లక్ష్మారావుకు అనిరుధ జగన్నాథరావు, విధుర రాజగోపాలరావు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరు సికింద్రాబాద్‌లోని సురభి గార్డెన్‌లో నివాసం ఉంటున్నారు.
కళలకు పుట్టినిల్లు..


