సెమీస్‌కు పాలమూరు మహిళల జట్టు | - | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు పాలమూరు మహిళల జట్టు

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

సెమీస్‌కు పాలమూరు మహిళల జట్టు

సెమీస్‌కు పాలమూరు మహిళల జట్టు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: వరంగల్‌లో జరుగుతున్న సీనియర్‌ ఉమెన్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టీ–20 టోర్నమెంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మహిళా జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకొని సెమీఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 10 వికెట్ల తేడాతో ఆదిలాబాద్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆదిలాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 90 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. మహబూబ్‌నగర్‌ బౌలర్లు అనిత, మేఘన చెరో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్‌ 10.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. జట్టులో అక్షర రాథోడ్‌ (46 నాటౌట్‌), ఆర్యాని (25 నాటౌట్‌)గా నిలిచారు.ఈనెల 6వ తేదీన మహబూబ్‌నగర్‌ జట్టు సెమీఫైనల్‌లో ఖమ్మం జట్టుతో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement