ఆస్పత్రి నిర్మాణంలో వేగం పెంచాలి
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
మక్తల్: పట్టణంలో నిర్మించే 150 పడకల ఆస్పత్రి పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పనుల్లో నాణ్యత లోపించకుండా వేగంగా పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తోందని.. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. పట్టణంలోని ట్యాంక్‌బండ్‌ను రూ.3.70 కోట్లతో సుందరీకరిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పుర కమిషనర్ శ్రీరాములు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేష్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, ఆనంద్‌గౌడ్, నాగరాజు, గోవర్ధన్, దండు రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి..
నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని మాధ్వార్ గట్టుతిమ్మప్ప ఆలయ ఆవరణలో కల్యాణ మండప నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్యాణ మండప నిర్మాణానికి గ్రామస్తులందరు కలిసి రూ.35 లక్షల విరాళంగా అందజేయడం అభినందనీయమన్నారు. గ్రామం నుంచి ఆలయం వరకు రూ.70 లక్షలతో సీసీ రహదారి నిర్మిస్తామని.. వచ్చే జాతర వరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రహదారి విస్తరణ చేపట్టేందుకు గ్రామస్తులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. కల్యాణ మండప నిర్మాణానికిగాను తనవంతు సహకారం అందించాలని తెలిపారు. అనంతరం మంత్రిని నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్‌కుమార్, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ నిర్వాహకులు రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సంతోష్‌రెడ్డి, శ్రీనివాసులు, సత్యనారాయణ, శంకర్, రామకృష్ణ, బ్యాంకు నర్సింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


