ప్రజాతీర్పును గౌరవిద్దాం : బీఆర్‌ఎస్
నారాయణపేట: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి, అభిమానించి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించారని.. వారి తీర్పును గౌరవించాలని, రానున్న రోజులు బీఆర్‌ఎస్‌వేనని ఈ ఎన్నికలు రుజువు చేశాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 3వ వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ, 7వ వార్డు కౌన్సిలర్ భరత్‌ను ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పూలమాల, శాలువాతో సన్మానించి మాట్లాడారు. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌పార్టీకి పుర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎన్నికల ముందు మంత్రి హడావుడిగా వచ్చి శిలాఫలకాలు వేసినా, రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీలిచ్చినా ప్రజలు విశ్వసించలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నారాయణపేట పుర ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనమన్నారు. పార్టీ కౌన్సిలర్లు సమస్యలపై తమ వాణి వినిపించి ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ఓడిన అభ్యర్థులు విజయానికి తొలిమెట్టు అనుకొని ప్రజల్లో ఉంటూ సమస్యలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కన్నా జగదీశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, నాయకులు బోయ లక్ష్మణ్, సురేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, స్టాంప్ రాంరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
అలంపూర్ ఆలయాల్లో కేంద్రమంత్రి
అలంపూర్: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అలంపూర్ హరితహోటల్ వద్ద కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ ఆలయాల్లో కేంద్రమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. జోగుళాంబ దేవిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి అని, మరోసారి అమ్మవారి దర్శనానికి వస్తానని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ప్రజాతీర్పును గౌరవిద్దాం : బీఆర్‌ఎస్


