‘కమల’వికాసం
నారాయణపేట
● పేటలో నెగ్గిన అత్త.. తగ్గిన కోడలు
● మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌ఎన్నికకు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల గైర్హాజరు
ఆదిదంపతుల కల్యాణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
–IIలో u
నారాయణపేట: జిల్లాకేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో కమలం వికసించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉత్కంఠ రేపిన పుర పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. ఎంపీ డీకే అరుణ వ్యూహరచణతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సతీమణి కొండ శ్వేత, వైస్‌చైర్‌పర్సన్‌గా మంజుల రాఘవేందర్‌రెడ్డి ఎన్నిక కావడం కమలనాథుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి వరుసకు మేనత్త అయిన ఎంపీ డీకే అరుణ పేట మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేసిన తరుణంలో నెగ్గిన అత్త.. తగ్గిన కోడలంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల గైర్హాజరు..
పేట మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఇద్దరు కౌన్సిలర్లు పాల్గొనకుండా గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మొదటి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారనే ప్రచారం కొనసాగింది. ఈ క్రమంలోనే పుర పీఠాన్ని కై వసం చేసుకుంటామనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉండగా.. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి అందరి అంచనాలను తలకిందులు చేశారనే చర్చ సాగుతోంది.
ఆమెకే పెద్దపీట..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మహిళా కౌన్సిలర్లు చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించారు. మరో నలుగురు వైస్‌చైర్‌పర్సన్లుగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. పేట చైర్‌పర్సన్‌గా బీజేపీకి చెందిన కొండ శ్వేత, వైస్‌చైర్మన్‌గా మంజుల ఎన్నికయ్యారు. కోస్గి మున్సిపల్ చైర్మన్‌గా నాగులపల్లి నరేందర్, వైస్ చైర్‌పర్సన్‌గా చింతల సరితకు అవకాశం కల్పించారు. మద్దూర్ బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. ఇక్కడ పురుషులకు అవకాశం ఉన్నప్పటికీ.. చైర్‌పర్సన్‌గా డి.సరస్వతి, వైస్ చైర్‌పర్సన్‌గా భాగ్యశ్రీకి పట్టం కట్టారు. మక్తల్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం జనరల్‌కు రిజర్వు కాగా.. చైర్‌పర్సన్‌గా వాకిటి మానసకు పుర పీఠం వరించింది.
జనరల్ స్థానాల్లో బీసీలకు పట్టం..
కోస్గి మున్సిపాలిటీ జనరల్‌కు రిజర్వు కాగా.. చైర్మన్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు నాగులపల్లి నరేందర్‌కు అవకాశం కల్పించారు. నారాయణపేట మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వు కాగా.. బీజేపీ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండ శ్వేతను చైర్‌పర్సన్ చేసింది. మక్తల్ జనరల్ రిజర్వు కాగా.. బీసీ సామాజికి వర్గానికి చెందిన వాకిటి మానసకు చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టారు.
వైస్‌చైర్మన్ ఎన్నికకు‘చెయ్యి’చ్చిన ఎంఐఎం..
కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్‌పర్సన్ ఎన్నికకు ఎంఐఎం ఇద్దరు కౌన్సిలర్లు చేతులెత్తారు. కానీ వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక వచ్చేసరికి ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్‌కు మద్దతుగా కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యెత్తారు. ఎంఐఎం కౌన్సిలర్లు మాత్రం తటస్థంగా ఉండటంతో మరోసారి అధికార పార్టీ ఖంగుతింది.
సీఎం ఇలాకా.. కాంగ్రెస్ పార్టీకే..
సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలోని కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. అదే విధంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలోని మక్తల్ మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మూడింటిని అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుంది.
‘కమల’వికాసం


