కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 71 వార్డులకు ఎన్నికలు
● మక్తల్, కోస్గి, మద్దూరులో 2 రౌండ్లు, పేటలో 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులకు గాను 71 వార్డుల్లో 90,301 మంది ఓటర్లు ఉండగా.. 66,859 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకో వడంతో ఎన్నిక వాయిదా పడిన విషయం పాఠకులకు విదితమే. ఆ వార్డు మినహా మిగతా వార్టుల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మద్దూర్, మక్తల్, కోస్గి మున్సిపాలిటీల్లో రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. నారాయణపేటలో 24వార్డులు ఉండడంటంతో మూడు రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక ఆర్‌ఓ, హాల్ సూపర్‌వైజర్లను నియమించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల్లోని పీఎస్‌ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
నాలుగు టేబుళ్ల చొప్పున..
నారాయణపేట మున్సిపాలిటీలో రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కౌంటింగ్ హాల్‌లో నాలుగు టేబుళ్ల చొప్పున ఏర్పాటుచేసి.. ఒక్కొక్క రౌండ్‌లో రెండు కౌంటింగ్ హాళ్లలో 8 వార్డుల లెక్కింపు పూర్తిచేయనున్నారు. మొదటి రౌండ్‌లో 1, 4, 7, 10, 13, 16, 19, 22 వార్డులు, రెండో రౌండ్‌లో 2, 5, 8, 11, 14, 17, 20, 23, మూడో రౌండ్‌లో 3, 6, 9, 12, 15, 18, 21, 24 వార్డుల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం


