‘108’ అంబులెన్స్ వాహనాల తనిఖీ
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, దామరగిద్ద, కృష్ణా తదితర మండల కేంద్రాల్లోని 108 వాహనాలను మంగళవారం ప్రోగ్రామ్ మేనేజర్లు, జిల్లా కో–ఆర్డినేటర్లు, సంస్థ ఆడిట్ అధికారి కిషోర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, అత్యవసర వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఔషధాల లభ్యత, వాహన నిర్వహణ, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించి బాధితుల ప్రాణాలు రక్షించడానికి సిద్ధంగా ఉండాలనిసిసూచించారు.
జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేద్దాం
నారాయణపేట: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆపరేషన్ మెర్సీ ఫౌండేషన్ జిల్లా కో–ఆర్డినేటర్ హజమ్మ కోరారు. మంగళవారం మండలంలోని లింగంపల్లి ఎల్లమ్మ జాతరలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్య సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మూఢ నమ్మకాలు, జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను గౌరవించి చదివించాలని, దేవత పేరుతో జోగిని, బసివిని, దేవదాసీలుగా మార్చడం చట్టరీత్యా నేరమని.. 1986 జోగిని చట్టం ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రతి పౌరుడు చట్టాల గురించి తెలుసుకోవాలని, మూఢ నమ్మకాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కో–ఆర్డినేటర్ ఆశమ్మ, నారాయణ, ఆరోగ్య కార్యకర్తలు, జోగిని కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.9,539
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.9,539, కనిష్టంగా రూ.4,240 ధర పలికింది. అదేవిధంగా ఆలసందలు రూ.6,170, ఎర్ర కంది గరిష్టంగా రూ.7,809, కనిష్టంగా రూ.6,536, శనగ రూ.5,270, ధరలు లభించాయి.
‘108’ అంబులెన్స్ వాహనాల తనిఖీ


