ప్రజాసేవతోనే సమాజంలో గుర్తింపు
మక్తల్: ప్రజాసేవతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్లుగా ఎన్నికై న వాకిటి మానస, బి.శైవిరెడ్డిలను ఆయన శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కోళ్ల వెంకటేశ్, కట్ట సురేశ్, అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


