పకడ్బందీగా మాదక ద్రవ్యాల నియంత్రణ
నారాయణపేట: మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని వైద్య, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీల నేతృత్వంలో విద్యార్థులకు అవగాహన కల్పించి నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు చేపట్టకుండా వ్యవసాయశాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా రైతు సాగు చేస్తున్నట్లు రుజువైతే చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని చెప్పారు. పోలీసు, ఎకై ్సజ్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని.. సమన్వయంతో మాదక ద్రవ్యాల నిషేధం జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో రషీద్, సీఐ శివశంకర్, వైద్యశాఖ అధికారి భిక్షపతి, కలెక్టరేట్ సి–సెక్షన్ అధికారి జయసుధ, ఎకై ్సజ్ సీఐ, ఎస్‌ఐ పాల్గొన్నారు.
‘స్వచ్ఛ’ పద్ధతులు పాటించాలి..
జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా శుభ్ర త, పారిశుద్ధ్య పద్ధతు లు పాటించాలని రెవె న్యూ అదనపు కలెక్టర్ శ్రీను కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ఆహార భ ద్రత జిల్లాస్థాయి సల హా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఆహార వ్యాపార యూనిట్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి నెల రిజిస్ట్రేషన్, లైసెనన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆహార భద్రత అధికారి మౌనిక తెలిపారు. ఆహార వ్యాపార సంస్థలను తనిఖీ చేసి అనుమానిత నమూనాలను రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారం, తాగునీటి నమూనాలను సేకరించి నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు వివరించారు. వాటికి కూడా లైసెన్స్‌లు జారీ చేస్తామని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గత సమావేశంలోనే దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించినా ఎవరూ స్పందించ లేదని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన పాఠశాలల హెచ్‌ఎంలు, వసతి గృహాల వార్డెన్లు, అంగన్‌వాడీ టీచర్లు విధిగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో రెండోసారి జరిగిన సమావేశంలో ఆర్డీఓ రామచందర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రషీద్, వైద్యశాఖ అధికారి భిక్షపతి, డీడబ్ల్యూఓ కార్యాలయ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
పకడ్బందీగా మాదక ద్రవ్యాల నియంత్రణ


