102, 108 వాహన సేవలు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

102, 108 వాహన సేవలు భేష్‌

Feb 8 2026 7:40 AM | Updated on Feb 8 2026 7:40 AM

102, 108 వాహన సేవలు భేష్‌

102, 108 వాహన సేవలు భేష్‌

మక్తల్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 102, 108 వాహనాలు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయని, వాహనాలు బాగా పని చేస్తున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ కె.రవి తెలిపారు. శనివారం పట్టణంలోని వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రమాద బాధితులు, ఆపదలో ఉన్న వారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారు. 102 అమ్మ ఒడి వాహనాలను గర్భిణుల వైద్య సేవలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత తల్లీబిడ్డను ఇంటికి చేర్చడానికి, ఐదేళ్లలోపు చిన్నారుల వ్యాక్సినేషన్‌కు వినియోగించాలని సూచించారు. నయాపైస ఖర్చు లేకుండా 102, 108 వాహనాలు ఇళ్ల దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్‌ పి.సునీల్‌కుమార్‌, టెక్నీషియన్‌ ఆంజనేయులు, పైలెట్లు శివశంకర్‌, రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement