24న నీతి ఆయోగ్ అదనపు డైరెక్టర్ రాక
నర్వ: నీతి ఆయోగ్ సంస్థ జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా మండలాన్ని ఎంపికచేసి యాస్పిరేషన్ బ్లాక్‌గా గుర్తించింది. ఈ నెల 24న నీతి ఆయోగ్ అదనపు డైరెక్టర్ మండలంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఆమె మండలంలోని పెద్దకడ్మూర్, రాయికోడ్ గ్రామాల్లో పర్యటించారు. పెద్దకడ్మూర్‌లోని పీఎంశ్రీ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో సౌకర్యాలు, పరికరాలు విద్యార్థుల సామర్థ్యాలు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలో వార్షిక బడ్జెట్ వ్యయంతో కొనసాగుతున్న కార్యక్రమాలను జీహెచ్‌ఎం భాగ్యలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం రాయికోడ్‌లో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీచేసి స్యామ్, మామ్ ద్వారా చిన్నారులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. నర్వలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట శిక్షణ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డీఆర్డీఓ మొగులయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


