జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్
నారాయణపేట: జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన వికారాబాద్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా.. బదిలీపై ఇక్కడకు వస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీపై స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా వెళ్లారు. అదేవిధంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఫణిందర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
మార్చి 28నజాతీయ లోక్ అదాలత్
నారాయణపేట: రాజీమార్గంలో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో దోహదపడుతుందని సీనియర్ సివిల్ న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ కార్యదర్శి వింధ్యానాయక్ సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను మార్చి 28న నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని 14 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 6,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు అధికారులతో ఆరా తీసి ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం పొందవచ్చన్నారు. జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఎజెండాలోని క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, సైబర్ నేరాల కేసులపై చర్చించారు. అనంతరం ఉచిత న్యాయ సహాయ సేవలు టోల్‌ఫ్రీ నంబర్ 15100 చార్ట్‌ని ఆవిష్కరించి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్, డీఎస్పీ లింగయ్య, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
సజావుగా ‘పది’ పరీక్షల నిర్వహణ
నారాయణపేట రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు సూచించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదోతరగతి పరీక్షల నిర్వహణపై గురువారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన హాజరై మాట్లాడారు. మాల్ ప్రాక్టీస్‌ను నియంత్రించాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని.. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం తదితర వాటిపై దృష్టి సారించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు కేటాయించిన సామగ్రిని భద్రపర్చే విషయంలో నిర్లక్ష్యం సరికాదన్నారు. పరీక్షల నిర్వహణపై సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని, ఇన్విజిలేటర్లకు సరైన దిశా నిర్దేశం చేయాలని కోరారు. ప్రశ్నాపత్రాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో తెరవాలని, సరైన సమయానికి విద్యార్థులకు అందించాలన్నారు. కార్యక్రమంలో సీఎంఓ రాజేంద్రకుమార్, పరీక్షల విభాగం అధికారి శశికుమార్, మండల విద్యాధికారులు, పరీక్ష నిర్వాహకులు పాల్గొన్నారు.
రంగనాథస్వామి
బ్రహ్మోత్సవాలు
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు గురువారం ఉదయం మంగళ వాయిద్యాలు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. యజ్ఞశాలలో హోమం, భేరీపూజ కొనసాగాయి. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల భక్తులు తరలిరాగా.. వేడుక అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, కన్నయ్యశర్మ, గోవిందాచార్యులు, సురేశాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్
జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్


