కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వీడాలి | - | Sakshi
Sakshi News home page

కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వీడాలి

Feb 13 2026 5:48 AM | Updated on Feb 13 2026 5:48 AM

కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వీడాలి

కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వీడాలి

నారాయణపేట ఎడ్యుకేషన్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వీడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, మాస్‌లైన్‌ జిల్లా నాయకుడు కాశీనాథ్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం డిమాండ్‌ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. ముందుగా స్థానిక మున్సిపల్‌ పార్కు వద్ద సభ ఏర్పాటు చేశారు. అనంతరం సావర్కర్‌ చౌరస్తా మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీగా చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చి, కార్మిక వర్గంపై యుద్ధం చేస్తుందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను దివాలా తీయించేందుకు, కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికి, ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక పాలసీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజ్‌, నర్సింహ, శశికళ, శివకుమారి, బాలమణి, అనురాధ, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహి స్తున్న కార్మిక సంఘాల నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement