బీజేపీ విజయం ఖాయం | - | Sakshi
Sakshi News home page

బీజేపీ విజయం ఖాయం

Feb 13 2026 5:48 AM | Updated on Feb 13 2026 5:48 AM

బీజేప

బీజేపీ విజయం ఖాయం

నారాయణపేట రూరల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూరావు నామాజీ ధీమా వ్యక్తంచేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రతంగ్‌ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షు డు సత్యయాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడా రు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు నిలిచారని.. ప్రజల ఆశీస్సులతో అనూహ్య ఫలితాలు సాధించబోతున్నామని అన్నారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్‌, అమరచింత మున్సిపాలిటీలను కై వసం చేసుకోనున్నామని.. మిగతా మున్సిపాలిటీల్లో గణనీయమైన సంఖ్యలో వార్డు కౌన్సిలర్లను గెలుచుకుంటామ ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు విసిగి న ప్రజలు బీజేపీ వైపు నిలిచారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శ్యాంసుందర్‌ గౌడ్‌, మాజీ ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు పోషల్‌ వినోద్‌, మీడియా ఇన్‌చార్జి కిరణ్‌ ఉన్నారు.

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి

నారాయణపేట రూరల్‌: ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఫ్యాకల్టీ ఈడీ మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జాజాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మూడో తరగతి విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించడం.. రాయించడం వంటి వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న జరిగే ఎఫ్‌ఎల్‌ఎం పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లిష్‌లో ధారాళంగా చదవడం.. గణితంలో చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి భాషలో తప్పనిసరిగా చదవడం, రాయడం రావాలని సూచించారు. అనంతరం ధన్వాడ మండలం కన్సన్‌పల్లి, మరికల్‌ ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్‌ఓ భానుప్రకాశ్‌, హెచ్‌ఎంలు అనురాధ, రజిత, బాలకృష్ణ ఉన్నారు.

నల్లమలలో

ఆక్వా కల్చర్‌ సెంటర్‌

అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తా మని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నా రు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్‌ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్ల తో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్‌లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్‌ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అచ్చంపేట ముదిరాజ్‌ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం సామర్థ్యాన్ని 30 లీటర్లకు పెంచుతామన్నారు. ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్‌లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.

బీజేపీ విజయం ఖాయం 
1
1/2

బీజేపీ విజయం ఖాయం

బీజేపీ విజయం ఖాయం 
2
2/2

బీజేపీ విజయం ఖాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement