రేపట్నుంచి నియోజకవర్గస్థాయి సీఎం కప్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి నియోజకవర్గస్థాయి సీఎం కప్‌ పోటీలు

Feb 8 2026 7:40 AM | Updated on Feb 8 2026 7:40 AM

రేపట్నుంచి నియోజకవర్గస్థాయి సీఎం కప్‌ పోటీలు

రేపట్నుంచి నియోజకవర్గస్థాయి సీఎం కప్‌ పోటీలు

నర్వ: మండలంలోని పాతర్చేడ్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం నుంచి సీఎం కప్‌ సెకండ్‌ ఎడిషన్‌ నియోజకవర్గస్థాయి క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు టోర్నమెంట్‌ కన్వీనర్‌, ఎంఈఓ రాంరెడ్డి, క్రీడల ఇన్‌చార్జ్‌, పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిర్వహించే సీఎం కప్‌ పోటీలను విజయవంతం చేయాలన్నారు. ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్‌ తదితర క్రీడాపోటీలు నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని మక్తల్‌, మక్తల్‌ అర్బన్‌, ఊట్కూర్‌, మాగనూర్‌, కృష్ణ, ఆత్మకూర్‌, ఆత్మకూర్‌ అర్బన్‌, అమరచింత మండలాల్లో ఎంపికై న క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలన్నారు. ఎంపికై న క్రీడాకారులు సోమవారం ఉదయం 9 వరకు మైదానానికి చేరుకోవాలని సూచించారు.

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ అర్హత పరీక్ష

కందనూలు/ బిజినేపల్లి: వట్టెం జవహార్‌ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశాల కోసం 1,520 విద్యార్థులకు గాను 1,067 విద్యార్థులు హాజరు కాగా.. 11వ తరగతి కోసం 3,072 మంది విద్యార్థులకు గాను 2,353 మంది పరీక్షకు హాజరయ్యారని నవోదయ ప్రిన్సిపల్‌ భాస్కర్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement