చేతిపురం..! | - | Sakshi
Sakshi News home page

చేతిపురం..!

Feb 14 2026 9:58 AM | Updated on Feb 14 2026 9:58 AM

చేతిప

చేతిపురం..!

11 మున్సిపాలిటీల్లో ‘హస్తం’ హవా

ఉమ్మడి పాలమూరులో గ్రామపంచాయతీ పోరులో పైచేయి సాధించిన కాంగ్రెస్‌ పురపాలిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌తోపాటు మరో 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఐదు పురపాలికల్లో (గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకద్ర, అలంపూర్‌) హంగ్‌ ఏర్పడింది. 11 చోట్ల ‘హస్తం’ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌, దేవరకద్రలో మ్యాజిక్‌ ఫిగర్‌కు అడుగు దూరంలో ఉండగా.. ఈ పీఠాలనూ కై వసం చేసుకోనుంది. గత పురపాలక ఎన్నికల్లో ఎనిమిదింటిలో పూర్తి ఆధిక్యతను కనబర్చిన బీఆర్‌ఎస్‌కు ఈ సారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క అయిజలోనే గెలుపొందింది. బీజేపీ బోణీ కూడా చేయలేక చేతులెత్తేసింది. నారాయణపేటలో ఆధిక్యతను కనబర్చినా.. మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది.

– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌.. బీజేపీ..

మ్మడి పాలమూరులో ఎన్నికలు జరిగిన మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు.. 18 పురపాలికల్లో 316 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌ 30 డివిజన్లు, 179 వార్డుల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ 15 డివిజన్లు, 75 వార్డులు.. బీజేపీ ఏడు డివిజన్లు, 38 వార్డుల్లో గెలుపొంది ఆ తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఏఐఎఫ్‌బీ తొమ్మిది, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు తొమ్మిది, సీపీఎంకు చెందిన ఇద్దరు గెలుపొందారు. మక్తల్‌లోని ఆరో వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌తో పాటు ఐదింటిలో హంగ్‌

బోల్తాపడ్డ కారు.. ఒక్క అయిజలోనే మెజార్టీ

తారుమారైన బీజేపీ అంచనాలు

నారాయణపేటలో ఆధిక్యత.. అయినా ఊగిసలాట

దేవరకద్రలో రెబల్‌ చేరికతో హస్తానికి లైన్‌క్లియర్‌

అలంపూర్‌లో బీఆర్‌ఎస్‌కు అవకాశం

గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు షాకిచ్చిన ఫలితాలు

ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య దోబూచులాట

చేతిపురం..! 1
1/2

చేతిపురం..!

చేతిపురం..! 2
2/2

చేతిపురం..!

Advertisement
 
Advertisement
Advertisement