అడవి బిడ్డలకు అండగా ఆర్డీటీ | - | Sakshi
Sakshi News home page

అడవి బిడ్డలకు అండగా ఆర్డీటీ

Feb 26 2026 9:09 AM | Updated on Feb 26 2026 9:09 AM

అడవి బిడ్డలకు అండగా ఆర్డీటీ

అడవి బిడ్డలకు అండగా ఆర్డీటీ

చేనేత ఉత్పత్తులకు గుర్తింపు

నారాయణపేట: జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్‌ ఆధ్వర్యంలో జౌళి మంత్రిత్వశాఖ, చేనేత అభివృద్ధి కమిషనర్‌ కార్యాలయ సహకారంతో ‘భౌగోళిక సూచిక వినియోగం–అధికరణ(జీఐ)’పై బుధవారం జిల్లాకేంద్రంలోని ఎస్‌ఆర్‌ గార్డెనన్స్‌లో చేనేత కార్మికులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. సంబంధితశాఖ సీఈఓ తేజస్‌ చేనేత కార్మికులు భౌగోళిక సూచిక సర్టిఫికెట్‌ పొందడం ప్రాముఖ్యతను వివరించారు. సర్టిఫికేషన్‌ కలిగి ఉంటే ఇక్కడి చేనేత చీరలు, సంప్రదాయ హ్యాండ్లూమ్‌ ఉత్పత్తులకు ప్రపంచ గుర్తింపు, మార్కెటింగ్‌, లాభాలు పొందవచ్చని చెప్పారు. జీఐతో బ్రాండ్‌ విలువ పెరగడమేగాకుండా మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి తోడ్పడుతుందన్నారు. జీఐ సర్టిఫికేషన్‌తో కళాకారులను శక్తివంతం చేయడంతో పాటు సంప్రదాయాలతో కూడిన విలువలు, చేనేత పద్ధతులను పరిరక్షించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త అవకాశాలను సృష్టించడం సాధ్యమవుతుందని వివరించారు. శిక్షణలో రీజినల్‌ ఇన్‌చార్జ్‌ బీఎస్‌ గణేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాబు, సాంకేతిక సిబ్బంది బాలాజీ, స్థానిక చేనేత కార్మికులు, కళాకారులు, హ్యాండ్లూమ్‌ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

క్రీడా పాఠశాలల్లోప్రవేశాలకు దరఖాస్తులు

నారాయణపేట: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని.. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్‌ఓ వెంకటేష్‌శెట్టి బుధవారం తెలిపారు. గురువారం నుంచి వచ్చే నెల నాలుగో తేదీ సాయంత్రం ఐదు వరకు tggss.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో వచ్చే నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఎంపికలు చేపడతామన్నారు. ఆధార్‌కార్డు, విద్యనభ్యసిస్తున్నట్లు ప్రస్తుత పాఠశాల నుంచి ధ్రువపత్రం, జన్మ, కుల ధ్రువీకరణపత్రం, మూడోతరగతి ప్రగతి పత్రం, ఐదు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

– వివరాలు 8లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement