అందరి సహకారంతోనే అభివృద్ధి
మక్తల్: అందరి సహకారంతో పురపాలికను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని పుర చైర్‌పర్సన్ వాకిటి మానస తెలిపారు. శుక్రవారం పుర కార్యాలయంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ శైవిరెడ్డి బాధ్యతలు స్వీకరించగా.. మంత్రి వాకిటి శ్రీహరి వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మంత్రి సహకారంతో పురపాలికలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, వీధిదీపాలు తదితర అభివృద్ధి చేపడతానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కౌన్సిలర్లు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, కౌన్సిలర్లు రహీం పటేల్, అల్కూరి పావని, సరిత, జుట్ల అనిత, శ్రీవిద్య, చెన్నమ్మ, అమరేందర్‌రెడ్డి, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.


