సంత్‌ సేవాలాల్‌ మార్గం ఆచరణీయం | - | Sakshi
Sakshi News home page

సంత్‌ సేవాలాల్‌ మార్గం ఆచరణీయం

Feb 21 2026 8:01 AM | Updated on Feb 21 2026 8:01 AM

సంత్‌

సంత్‌ సేవాలాల్‌ మార్గం ఆచరణీయం

మహిళలే నిర్వాహకులు..

బంక్‌లో రోజు 4 వేల లీటర్ల పెట్రోల్‌, 6 వేల లీటర్ల డీజిల్‌ విక్రయిస్తున్నారు. విధులు నిర్వర్తించే 11 మంది సేల్స్‌ ఉమెన్‌లకు ఒక్కొక్కరికి నెలకు రూ.13 వేలు, మహిళా మేనేజర్‌కు రూ.18 వేల వేతనం జిల్లా సమాఖ్య నుంచి చెల్లిస్తున్నారు. ఏడాది కాలంలో 7,49,339 లీటర్ల పెట్రోల్‌ విక్రయించగా రూ.8,15,80,530.. 7,90820 లీటర్ల డీజిల్‌ విక్రయించగా రూ.7,68,04,438 ఆదాయం సమకూరింది. లీటర్‌కు పెట్రోల్‌పై రూ.3.43, డీజిల్‌పై రూ.2.05 చొప్పున కమీషన్‌ వస్తోంది. నిర్వహణ ఖర్చులు, వేతనాలు పోను ఏడాదిలో రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ఊట్కూర్‌: సంత్‌సేవాలాల్‌ మహారాజ్‌ చూపించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లితండాలో సేవాలాల్‌ 287వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్‌ ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రతి తండాలోని పిల్లలను విధిగా చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, చదువుతోనే బంగారు భవిష్యత్‌ వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తండాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. అంతకముందు తండావాసులు మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలు చేస్తూ మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ వినీత్‌రాజ్‌, ఆర్డీఓ రాంచందర్‌నాయక్‌, సర్పంచ్‌ మోహన్‌నాయక్‌, తహసీల్దార్‌ చింతరవి, సీతానాయక్‌ పాల్గొన్నారు.

సంత్‌ సేవాలాల్‌ మార్గం ఆచరణీయం 1
1/1

సంత్‌ సేవాలాల్‌ మార్గం ఆచరణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement