63 మంది విద్యార్థులు గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

63 మంది విద్యార్థులు గైర్హాజరు

Feb 27 2026 8:17 AM | Updated on Feb 27 2026 8:17 AM

63 మంది విద్యార్థులు గైర్హాజరు

63 మంది విద్యార్థులు గైర్హాజరు

నారాయణపేట రూరల్‌: జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 15 పరీక్ష కేంద్రాల్లో 3,823 మంది విద్యార్థులకుగాను 3,760 మంది హాజరుకాగా.. 63 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్‌ విద్యార్థులు 3,283 మందికిగాను 3,234 మంది విద్యార్థులు హాజరుకాగా.. 49 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్‌ విద్యార్థులు 540 మంది విద్యార్థులకుగాను 526 మంది హాజరుకాగా.. 14 మంది రాయలేదు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు తనిఖీ చేశాయి. బందోబస్తును పోలీసు అధికారులు పర్యవేక్షించారు. పరీక్ష ప్రారంభానికి ముందు విద్యార్థులను సిబ్బంది పూర్తిగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement