క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Feb 7 2026 9:40 AM | Updated on Feb 7 2026 2:54 PM

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

ఊట్కూర్‌: క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని తహసీల్దార్‌ చింత రవి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్జీఎఫ్‌ అండర్‌–14 బాలల సాఫ్ట్‌బాల్‌ ఎంపికలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి 120 మంది బాలలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు త్వరలో మహబూబాబాద్‌ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కిశోర్‌, డీవైఎస్‌ఓ వెంకటేష్‌శెట్టి, పీడీ సాయినాథ్‌, కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, బాలరాజు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా అండర్‌–15 రెజ్లింగ్‌ పోటీలు..

ధన్వాడ: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి పాలమూరు జిల్లా రెజ్లింగ్‌ (కుస్తీ) పోటీల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఆయా జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని జిల్లా రెజ్లింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవికుమార్‌ తెలిపారు. గ్రామీణప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ఎంపికలు ఎంతగానో దోహదపడుతాయని ఎంఈఓ గాయత్రి అన్నారు. పెద్దసంఖ్యలో క్రీడాకారులు తరలిరావడంతో ఈ ప్రాంతంలో కుస్తీ పోటీల పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుందని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్‌కుమార్‌, పీడీ నెల్సన్‌కుమార్‌, కోచ్‌ శ్రీనివాస్‌నాయక్‌, బాలాజీసింగ్‌నాయక్‌ తదితరులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement