ఓటే వజ్రాయుధం..
పగిడ్యాల్‌లో ‘కృష్ణతాత’
గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కృష్ణతాత ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
–8లో u
హక్కు.. బాధ్యతలపై అవగాహన
భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన జనవరి 25న ఏటా జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లుగా తమకున్న హక్కులు, బాధ్యతలను ప్రజలకు తెలియజేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించేందుకు రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


