కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి

Feb 2 2026 8:17 AM | Updated on Feb 2 2026 8:17 AM

కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి

కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి

పేటలో బీజేపీ, కాంగ్రెస్‌ మిలాఖత్‌ రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి

నారాయణపేట: సిట్‌ నోటీసులు ఒక్క కేసీఆర్‌కు కాదు.. తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, రైతులు, యావత్‌ ప్రజలకు ఇచ్చినట్లేనని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలో ఆయనతో పాటు మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకుడు, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సింగారం చౌరస్తాలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమై పురవీధుల్లో కొనసాగుతూ సత్యనారాయణ చౌరస్తా వరకు చేరింది. అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి దహనం చేసి మాట్లాడారు. కేసీఆర్‌కు సిట్‌ నోటీసులతో జిల్లా, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీల్లో జనాలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పేటలో బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటై బడా వ్యాపారి పైసలిచ్చి చైర్మన్‌ గిరి కొనుక్కున్నారంటూ ప్రతి మహిళా మాట్లాడుకుంటున్నారన్నారు. లోపాయికారి ఒప్పందంతో నీచ రాజకీయాలు చేస్తున్నాయని.. మానుకోవాలని హితవు పలికారు. మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. పుర ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని, మున్సిపల్‌ ఎన్నికల్లో 24 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు చెన్నారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, విజయ్‌సాగర్‌, రాంరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement