కేసీఆర్ జోలికొస్తే పాతరేస్తాం
మక్తల్: రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడు తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి తన నివాసం నుంచి నారాయణపేట క్రాస్‌రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి.. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష నేతలను కూడా జైలుకు పంపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇది తన దివాలకోరు రాజకీయానికి నిదర్శనమన్నారు. మక్తల్ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగి నైతిక హక్కు లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి దూది బాల్‌రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఉద్యమనేత కేసీఆర్‌కు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేశారని అన్నారు. తమ అధినేతను ముట్టుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, నాయకులు చిన్నహన్మంతు, శ్రీనివాస్‌గుప్తా, గాల్‌రెడ్డి, శ్రావణ్, ఈశ్వర్, నేతాజీరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మొగులప్ప, ఒంకార్, ఆంజనేయులు ఉన్నారు.


