ఎరువుల విక్రయాల్లో పారదర్శకత
కోస్గి రూరల్: యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులకు సులభంగా బుక్ చేసుకోవడంతో పాటు ఎరువుల అమ్మకాల్లో పారదర్శకత చేపట్టవచ్చని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మన గ్రోమోర్లను తనిఖీ చేశారు. డీలర్లు, అగ్రోస్, పీఎసీఎస్ నిర్వాహకులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్, ఏడీఏ రామకృష్ణ పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
మద్దూరు: మున్సిపల్ కేంద్రంలోని పీఏసీఎస్, మన గ్రోమోర్ ఎరువుల దుకాణాదారులు రైతులకు యురియా యాప్ బుకింగ్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రైతులకు యూరియా పంపిణీ సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ పాల్గొన్నారు.


