రెండో రోజు 124 నామినేషన్లు
నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండో రోజైన గురువారం 124 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 36 నామినేషన్లు వచ్చాయి. అందులో బీజేపీ నుంచి 10 మంది, కాంగ్రెస్ తరఫున 11 మంది, ఏఐఎంఐఎం నుంచి ఒకరు, బీఆర్‌ఎస్ నుంచి 12 మంది, టీడీపీ తరఫున ఒకరు, ఇండిపెండెంట్‌గా ఒకరు నామినేషన్ వేశారు. మక్తల్ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీఎస్పీ నుంచి 6, బీజేపీ తరఫున 10, కాంగ్రెస్ తరఫున 15, ఎంఐఎం ఒకటి, బీఆర్‌ఎస్ 5, ఇండిపెండెంట్ల నుంచి 3 నామినేషన్లు అందాయి. కోస్గిలోని 16 వార్డులో 27మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మద్దూర్‌లో 16 వార్డులకు గాను 21 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి నామినేషన్లు వేశారు. బీఆర్‌ఎస్ 7, కాంగ్రెస్ 6, బీజేపీ 5, స్వతంత్రులు ముగ్గురు నామినేషన్లు వేశారు.


